Pages

Wednesday, 28 September 9707

DIRECTOR PROFILE

 డాక్టర్ జయరాజ్ ప్రొఫైల్
కుటుంబ నేపథ్యం జయరాజ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో 1950లో జన్మించారు. భార్య పద్మావతి విశాఖ  బీహెచ్‌పీలో సెక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. జయరాజ్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా... కుమార్తె గైనకాలజిస్టుగా విధులు ర్వహిస్తున్నారు.

ప్రస్థానం...ఆంధ్రమెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో జయరాజ్ అధ్యాపకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి పదవీవిరమణ పొందారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు మెడికల్ ఆకాడమీ (ఆశ్రం) లో ఆప్తమాలజీలో హెడ్ఆఫ్ దీ డిపార్టుమెంట్ గా విధులు ర్వహిస్తున్నారు.1976లో ఆంధ్ర వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1981లో డిప్లమో ఇన్ ఆప్తమాలజీ, 1986లో ఎంఎస్, 1987-2000 వర కూ అసిస్టెంట్ ఫెసర్‌గాను, 2000-2008 వరకు ప్రొఫెసర్‌గా విధు లు నిర్వహించారు. 2008లో ఆశ్రంలో హెచ్ఓడిగా ఆప్తమాలిక్ విభాగంలో పనిచేశారు. ఆలివ్ ఆప్తమాలిక్ సొసైటీలో శాశ్వత సభ్యుడిగా ఉన్నారు. ఆమెరికన్ ఆకాడమీ ఆఫ్ ఆప్తమాలిక్ లో లైఫ్‌మెంబర్‌గా పనిచేశారు.  జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో జయరాజ్ తనదైన ముద్రవేశారు. ఇప్పటివరకూ 20కుపైగా అద్యాయన పత్రాలను సమర్పించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆప్తమాలజీ సెమినార్‌లో 1996, 2007లో ఆయన పాల్గొన్నారు. అమెరికన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యుఎస్ఏ లో 2011లో, హాలెండ్‌లో 1995లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు.

 డాక్టర్ జయరాజ్ సుమారు 50వేల వరకు క్యాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించారు. దీంతో పాటు కంటికి సంబంధించి పలు స్త్రచికిత్సలను దిగ్విజయంగా నిర్వహించిన ఘనత ఆయనది. జయరాజ్ ఆశ్రమ్ పాఠశాలలో విధుల్లో చేరినప్పుడు ఉన్న 100 సీట్లను 150 కు పెంచడంలో ఎంతో కృషిచేశారు. అదే విధంగా ఒక పీజీ సీటును 4 పీజీ సీట్లకు పెంచారు. గతంలో 30 వరకు ఉన్న కంటి చికిత్స ఓపీలను 150 వరకు పెంచారు. డాక్టర్ యరాజ్ వ్యక్తిగతంగా ఉచితంగా సుమారు 1000 పైగా కంటి మెడికల్ క్యాంపులను నిర్వహించారు.

అందుకున్న పురస్కారాలు :
 ఢిల్లీ తెలుగు అకాడమీ బెస్ట్ డాక్టర్‌గా 1998లో సత్కరించింది.1996లో ఇండియన్ అకాడమీ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ (న్యూఢిల్లీ)వారు మానవసేవ పురస్కారం అందించారు. 2005లో విజయనగరంలో 475 కంటి ఆపరేషన్లు నిర్వహించినందుకు గాను అప్పటి వైద్యశాఖ మంత్రి శంభాని చంద్రశేఖర్ సన్మానించారు. ఆశ్రం వైస్-చాన్స్‌లర్, శ్రీక్రిష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్లు డాక్టర్ జయరాజ్‌ను ఘనంగా సత్కరించారు. విజయనగరం, శాఖపట్నం ఏజన్సీలో సుమారు 1000 వరకూ ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించినందుకు గాను అప్పటి జిల్లా కలెక్టర్ అజయ్ కల్లాం డాక్టర్ జయరాజ్‌ను అంబేద్కర్ నేషనల్ అవార్డుకు నామినేట్ చేశారు. రచించిన పుస్తకాలు-1996లో దళితశక్తి, 2007లో 'కన్ను-వ్యాధులు-వైద్యం',కంటి వ్యాధులు,'విజయంకోసం-పయనం' లాంటి పుస్తకాలు రచించారు.